Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు


తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్షబోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు పేర్కొంది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని, అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దంది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని కోర్టు ఆదేశించింది. బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జీవో జారీ చేసింది.కరోనా థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రత్యక్ష బోధన వద్దని వేసిన పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని, వారంలోగా మార్గదర్శకాలు విడుదల చేయాలని విద్యాశాఖకు ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబరు, అక్టోబరులో మూడో దశ పొంచి ఉందని హెచ్చరికలు ఉన్నాయని, అలాగే విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయంది. ప్రత్యక్షబోధనపై పరస్పర విరుద్ద లాభనష్టాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఈ రెండిరటిని సమన్వయం చేసి చూడాలని హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img