Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భాగ్యనగరిలో 3.3 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో గూగుల్‌ క్యాంపస్‌

అమెరికాలోని మౌంటెన్‌ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్‌ దిగ్గజం గూగుల్‌ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో తన సెకండ్‌ లార్జెస్ట్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు చాలా కాలం క్రితమే గూగుల్‌ అంగీకరించినా… మట్టి తవ్వకం పనులు చాలా కాలం క్రితమే మొదలైనా.. కరోనా కారణంగా ఆ పనులు సుదీర్ఘ కాలం పాటు కొనసాగాయి. తాజాగా ఎట్టకేలకు మట్టి తవ్వకం పనులు పూర్తి కాగా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భవన నిర్మాణ పనులకు గూగుల్‌ శ్రీకారం చుట్టింది. ఈ పనులను కేటీఆర్‌తోనే ప్రారభించేసింది. ఇక ఈ క్యాంపస్‌ విషయానికి వస్తే… 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ కార్యాలయం నిర్మాణం కానుంది. 29 అంతస్తులతో ఏకంగా 94 మీటర్ల ఎత్తుతో ఈ భవంతి నిర్మితం కానుంది. మాదాపూర్‌ పరిధిలోని అమేజాన్‌ క్యాంపస్‌కు అతి సమీపంలో నిర్మితం కానున్న గూగుల్‌ క్యాంపస్‌ నగరానికి మరో ల్యాండ్‌ మార్క్‌గా నిలవనుందని కేటీఆర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img