Friday, April 26, 2024
Friday, April 26, 2024

మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తెస్తాం: మంత్రి ఎర్రబెల్లి

ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం జలాలను తీసుకొస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పోలేపల్లి, మడిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పోలెపల్లి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ, రూ.16 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.40లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో డ్రైనేజీలకు ప్రారంభోత్సవాలు చేశారు.రూ.4 కోట్ల 56 లక్షలతో చేపట్టిన పోలేపల్లి నుంచి చంద్రు తండా వరకు బీటీ రోడ్డు, రూ.60 లక్షలతో తాన్య తండాకు బీటీ రోడ్డు, రూ.14లక్షల 94 వేలతో మన ఊరు- మన బడి కార్యక్రమాల శంకుస్థాపనలు చేశారు.కంటాయపాలెం గ్రామంలో దుర్గమ్మ గుడికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఎండా కాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తాం. ఇక్కడి చెరువు నింపి, ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. గ్రామంలో అర్హులైన అందరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వచ్చే నెల నుంచే 57 ఏండ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామన్నారు. తొర్రూరు మండలంలోనే మడిపల్లికి అత్యధికంగా రూ.10 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి పనులు చేశాం. రూ.2 కోట్ల 60 లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌ పనులు చేపడుతాం వివిధ గ్రామాలకు లింకు రోడ్లు ఏర్పాటు చేసి చుట్టుముట్టు గ్రామాలకు మడిపల్లిని కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మడిపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img