Friday, April 26, 2024
Friday, April 26, 2024

మరో మహోద్యమానికి సిద్ధం కావాలి : రేవంత్‌

విశాలాంధ్ర `హైదరాబాద్‌ : సికింద్రబాద్‌ లోని ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్స వాల సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి అమ్మవారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అయనకు స్వాగతం పలి కారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేసి మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ స్థానిక సంస్థలకు అధికా రాలు కట్టబెట్టారని పేర్కొన్నారు. స్వయం పాల నతో గ్రామాలు అభివృద్ది చెందుతాయని రాజీవ్‌ దృఢంగా విశ్వసించారన్నారు. గ్రామాలు బాగుపడి తేనే దేశం బలంగా తయారవుతుందని రాజీవ్‌ గాంధీ ఏ మేలు కోసం అధికారాలను బదలాయిం చారో నేడు దానికి అనుగూణంగా తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదన్నారు. అడుగడుగునా ప్రజలు వివక్షను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్ప డిరదని అవేదన వ్యక్తం చేశారు. రాబోయే 20 నెలల్లో తెలంగాణకు పట్టిన పీడ వదలబోతుందని, స్వయం పాలన, స్వేచ్చ కోసం కలలుగని సాధిం చుకున్న తెలంగాణ ప్రజానీకం మరో మహోద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు…
తనకు ప్రేం సాగర్‌రావు మధ్య ఎలాంటి విబేధాలు లేవని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ జెండా దించకుండా మోసిన వారే తన బంధువులని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను చంపుకుని సోనియా తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని కాని నేడు ఇక్కడి ప్రజల అకాంక్షలు మాత్రం నెర వేరడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతిలో పెడితే నేడు దివాళా తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్‌ ప్రతి మనిషి మీద నేడు లక్ష రూపా యాల అప్పు తెచ్చారని వివరించారు. ఉప ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే ఆయనకు పథకాలు గుర్తుకొస్తాయని దుయ్యబట్టారు. ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారా ఇదే ప్రభుత్వ వ్యవహరశైలా అని ప్రశ్నిం చారు. దళిత బంధు పథకాన్ని కేవలం హుజూరా బాద్‌ నియోజకవర్గానికి పరిమతం చేస్తే మిగితా 118 నియోజకవర్గాల్లో దళితుల పరిస్థితి ఏంటని నిలదీశారు. కోటి ముప్పై ఐదు లక్షల మంది దళితలతో పాటు గిరిజనులకు కూడా దళితబంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాల్లో వేసుకుందామంటే సహించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఆగష్టు 9 నుంచి సెప్టెంబర్‌ 17వరకు దళిత గిరిజన దండోరా మోగిస్తామని, ఇంద్రవెళ్లి గడ్డమీద లక్షమందితో దండోరా మోగిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img