Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళలు లేనిదే వ్యవసాయం లేదు..వారి కష్టం వెలకట్టలేనిది

మహిళా రైతులతో కలిసి నాటేసిన వైఎస్‌ షర్మిల
ఉమ్మడి పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర

మహిళలు లేనిదే వ్యవసాయం లేదు.. వారి కష్టం వెలకట్టలేనిదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. నాటు వేసింది మొదలు పంట చేతికొచ్చే వరకు.. సగం పనులు వారివేనని కొనియాడారు. వ్యవసాయమైనా, ఇల్లు అయినా, దేశాన్ని అయినా నడిపించడంలో వారికి వారే సాటి అని స్పష్టం చేశారు షర్మిల. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. మహిళా రైతులతో కలిసి నాటేశారు. పొలంలోకి దిగి వారితో పనులు చేశారు.పాదయాత్ర సందర్భంగా కేసీఆర్‌ సర్కారుపై షర్మిల విమర్శలు గుప్పించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగు పడుతాయనుకుంటే.. బతుకే లేకుండా చేశారని ఆరోపించారు. ప్రతి ఒక్కరిపై రెండు లక్షల అప్పు పెట్టారని ఫైర్‌ అయ్యారు. ప్రజల తరపున ప్రశ్నిస్తారని ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. భూకబ్జాలు,సెటిల్‌ మెంట్లతో దందాలకు తెరలేపి, అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సంక్షేమ పాలనతోనే ప్రజలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.పేద పిల్లలకు సరైన తిండి లేదని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. రైతులకు రుణమాఫీ లేదు.. కౌలు రైతులకు సాయం లేదు.. అని విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ తెలంగాణను ఓ కాంట్రాక్టర్‌ చేతిలో పెట్టి కమీషన్లు దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img