Friday, April 26, 2024
Friday, April 26, 2024

రామప్ప అభివృద్ధికి పనిచేయండి

నిర్లక్ష్యం వహిస్తే నిందలు తప్పవు : హైకోర్టు
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో చారిత్రక సంపదను సంరక్షించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రామప్ప చారిత్రక సంపద సంరక్షణపై హైకోర్టులో విచారణ జరిగింది. పత్రికల కథనాలపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయస్థానం. యునెస్కో విధించిన గడువు డిసెంబర్‌ నెలాఖరు వరకు వుండటంతో సమగ్ర సంరక్షణ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏఎస్‌ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆగస్టు 4న తొలి సమావేశం నిర్వహించాలని.. క్షేత్ర స్థాయిలో సంయుక్త పరిశీలన జరపాలని ఆదేశించింది.నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని హైకోర్ట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం గర్వకారణమని, ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను తీర్చిదిద్దాలని హైకోర్ట్‌ కోరింది. యునెస్కో గడువులోగా కార్యాచరణ చేపట్టి శాశ్వత గుర్తింపు దక్కించుకోవాలని సూచించింది.అధికారులు నిర్లక్ష్యం వహిస్తే..దేశమంతా నిందిస్తుందని వివరించింది. కాలపరిమితులు విధించుకొని రామప్ప అభివృద్ధికి పనిచేయండి అని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 25కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img