Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు

ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. సముద్రమట్టానికి 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని, తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఇవాళ ఉదయం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img