Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రేపు బిఆర్ఎస్ కార్య‌వ‌ర్గం అత్య‌వ‌స‌ర భేటి

రాష్ట్రంలో పొలిటికల్‌ వార్‌ కొనసాగుతోంది. ఈ నెల 10న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా భేటీ- కానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, అన్ని స్థాయిల్లో నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారంతా విధిగా పాల్గొనాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో కీలకమైన నిర్ణయాలు, ఎన్నికల నేప థ్యంలో కొత్త వ్యూహాలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. మంత్రిమండలి సమావేశం అనంతరం జరుగుతున్న పార్టీ కీలక సమావేశం కావడంతో రాజకీయంగా అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేరోజు ఢిల్లీలోని జంత ర్‌మంతర్‌ వద్ద మహిళా బిల్లు డిమాండ్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటు-లో ప్రవేశ పెట్టాలని ఆమె గత కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు తీసుకువచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ దీక్షలో పాల్గొనాలని అన్ని పార్టీలు, సంఘాలకు ఆహ్వానాలు పంపారు. దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు కవితకు మద్దతుగా దీక్షలో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img