Friday, April 26, 2024
Friday, April 26, 2024

రేవంత్‌ రాకతో కాంగ్రెస్‌ బలోపేతం..

వీర్లపల్లి శంకర్‌

విశాలాంధ్ర`షాద్‌నగర్‌, రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ ముందు ఇకపై ఏ పార్టీ నిలబడ జాల దని, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి రాకతో పార్టీ బలంగా మారిందని కాంగ్రెస్‌ సీని యర్‌ నేత వీర్లపల్లి శంకర్‌ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు అధి ష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో షాద్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి వీర్లపల్లి ఆధ్వ ర్యంలో పెద్దఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు. సుమారు 80 కార్లు, 100 ద్విచక్ర వాహ నాలతో భారీగా బయల్దేరి వెళ్లారు. అదేవిధంగా కందుకూరు వద్ద కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్య క్షుడు చల్ల నరసింహారెడ్డితో కలిసి ఎడ్లబండిపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా వీర్లపల్లి శంకర్‌కు మధుయాష్కీ గౌడ్‌ ప్రసంగించే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్‌ ధర లీటరు రూ.70 ఉంటే ఇప్పుడు రూ.40 ఉందన్నారు. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.71ఉంటే.. ఇప్పుడు రూ.105 చేరిందని అన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలపై టీఆర్‌ఎస్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వాలకి పట్టదా అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బాబర్‌ అలీ ఖాన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షులు రాజుగౌడ్‌, కేశంపేట్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు జగదీష్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్య క్షులు చల్ల శ్రీకాంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు నందిగామ రామ్‌ రెడ్డి, ఫరూఖ్‌ నగర్‌ మండల్‌ అధ్యక్షుడు ఆశన్న గౌడ్‌, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చౌదరిగుడ మండల అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు, నందిగామ మండల అధ్యక్షుడు జంగా నర సింహ, కేశంపేట మండల అధ్యక్షుడు వీరేశం, కొత్తూరు హరినాథ్‌ రెడ్డి, ఎంపీ టీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం, ఎంపీటీసీిలు కొమ్ము కృష్ణ, కుమార స్వామి గౌడ్‌, రాజగోపాల్‌ రెడ్డి. శ్రీశైలం బొమ్మ అంజయ్య గౌడ్‌, మల్లేష్‌. మసూద్‌ ఖాన్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్‌, ముబా రక్‌, ఖదీర్‌, సుదర్శన్‌, హరినాథ్‌ రెడ్డి, ఎంపీటీసీ మల్లేష్‌ గౌడ్‌, తుపాకుల శేఖర్‌, సీతారాములు, కౌన్సిలర్‌ రాయికల్‌ శ్రీనివాస్‌, సుదర్శన్‌, నెహ్రూ నాయక్‌, జాకారం శేఖర్‌, మాధవులు, శ్రీనివాస్‌, నందారం అశోక్‌, లింగారెడ్డి గూడా అశోక్‌, నవీన్‌, తీగాపూర్‌ ఆంజనేయులు, గంగమోని సత్తయ్య, ఎలికట్ట డిప్యూటీ సర్పంచ్‌ రాజు, బుడ్డా నర్సింలు, లింగం పుల్లారెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img