Friday, April 26, 2024
Friday, April 26, 2024

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు స్థానికులకే కేటాయించాలి : సీపీఐ

విశాలాంధ్ర -కాప్రా: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల సముదాయాలను స్థానికులకే కేటా యించాలని, ప్రభుత్వ భూములను అమ్మా లని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విరమించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సమితి సభ్యులు, ఉప్ప ల్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ జి.దామోదర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ ఉప్పల్‌ మండల కౌన్సిల్‌ సమావేశం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్‌ రెడ్డి భవన్లో సీపీఐ సీనియర్‌ నాయకులు స్వామి దాస్‌ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా దామోదర్‌ రెడ్డి మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్క రించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపిం చారు. అర్హులందరికీ ఇళ్లను కేటాయిస్తామని చెప్పిన హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదన్నారు. అదే విధంగా ప్రభుత్వ స్థలాలను అమ్మాలనకోవడం అత్యంత దుర్మార్గమని, పోరాడి తెచ్చుకున్న తెలం గాణలో భూములను అమ్ముకోవాలన్న కేసీఆర్‌ విధానాలు సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు.
15న ‘ఛలో కలెక్టరేట్‌’
అర్హులైన స్థానికులకు ఇళ్లను కేటాయించా లని, ప్రభుత్వ భూముల అమ్మకాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ మేడ్చల్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ‘ఛలో కలెక్టరేట్‌ ముట్టడి’ నిర్వహించ నున్నట్లు, ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్య కర్తలను సమీకరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ ఉప్పల్‌ మండల కార్య దర్శి రామ్‌ నారాయణ, సహాయ కార్యదర్శి ధర్మేం ద్ర, కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి కృష్ణ, ఎం.న ర్సింహా, సత్య ప్రసాద్‌, బషీర్‌, జాన్‌, నర్సింగ్‌ రావు, కుమార్‌, విశాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img