Friday, April 26, 2024
Friday, April 26, 2024

సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైంది

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థ సొమ్మును కేసీఆర్‌ వాడుకుంటున్నారని విమర్శించారు. వేల కోట్ల ఆదాయం ఉన్నా… జీతాల సర్దుబాటుకు సింగరేణి సంస్థ అప్పులు చేస్తోందని తెలిపారు. సోమవారం కోల్‌ బెల్ట్‌లో బీఎంఎస్‌ కార్మిక చైతన్య యాత్రను ఈటెల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్‌కు అప్పగించే ఆలోచన కేంద్రానికి లేదని, కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కల్వకుంట్ల కవితకు సింగరేణికి ఏమి సంబంధం అని, సంస్థను దోచుకోడానికే ఆమె టిబిజికేఎస్‌కు గౌరవ అధ్యక్షురాలయ్యారని అన్నారు. ఆర్టీసీ- సింగరేణి సంస్థల్లో కార్మికుల చైతన్యాన్ని కేసీఆర్‌ చంపేశారన్నారు. టిబిజికేఎస్‌లో తప్ప వేరే సంఘంలో చేరితే బదిలీలు చేయడం దుర్మార్గమన్నారు. వేల కోట్ల తెలంగాణ ప్రజల డబ్బును ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం కేసీఆర్‌ ఖర్చు పెడుతున్నారని ఈటెల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img