Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

తప్పును ఎత్తి చూపడమే నేరమట…. రేవంత్ రెడ్డి

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు సిట్ ముందు హాజరయ్యారు. లీకేజీ విషయంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని సిట్ నోటీసులివ్వగా.. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సిట్ ఆఫీసుకు ఆయన చేరుకున్నారు.పేపర్ లీకేజీ కేసును సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ాాసిట్ కాదు… సీబీఐ విచారణ కావాల్సిందే. టీఎస్ పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది్ణ్ణ అని మరోసారి ఆరోపించారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఉ కేటీఆర్ అండ్ కో నియమించిన ాసిట్్ణ.. నన్ను విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే నేరమట. వెనక్కు తగ్గేదే లేదు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా్ణ్ణ అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img