Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నటి ఛౌరాసియపై దాడి ఘటనను చేధించిన పోలీసులు

సినీనటి షాలూ చౌరాసియాపై దాడి, మొబైల్‌ పోన్‌ చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడు మహబూబ్‌ నగర్‌ జిల్లా, కుల్కచర్లకు చెందిన కొమ్ముబాబుగా గుర్తించారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌.. నిందితుడు బాబును మీడియా ముందు హాజరుపరిచారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు.మూడేళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చినా బాబు.. సినిమా షూటింగ్‌లలో సెట్‌ వర్కర్‌గా పని చేసేవాడన్నారు. ప్రస్తుతం అతడు యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. బాబు గదిలో బౌరాసియా ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతనిపై గతంలో విజయవాడ, బంజారాహిల్స్‌, గోల్కొండ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. గోల్కొండ పీస్‌లో నమోదైన కేసులో చంచల్‌గూడ జైలుకు వెళ్లొచ్చాడని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img