Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

నాగార్జునసాగర్‌కు వరద..రెండు గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 68,263 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.సాగర్‌ ఇన్‌ఫ్లో 67,378 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్‌ ఫ్లో 70,836 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 312.0405 టీఎంసీలకుగాను 310.84 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img