Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు


నేడు పలుజిల్లాల్లో వర్షాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి సోమవారం దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా కోమరిన్‌ తీరం వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది.వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం గాంగెటిక్‌ పశ్చిమ బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతున్నదని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img