Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రైలులో భద్రాచలానికి గవర్నర్‌ తమిళిసై.. అటు ఏరియల్‌ సర్వేకు సీఎం కేసీఆర్‌

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరూ..!!
తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రేపు(ఆదివారం) ఏరియల్‌ స్వరే చేపట్టనున్నారు. ఈ సందర్బంగా వరద ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. రేపు(ఆదివారం) తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భద్రాచలానికి వెళ్లనున్నారు. వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరశీలించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్‌ నుంచి రైలులో గవర్నర్‌ తమిళిసై.. భద్రాచలానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయానికి భద్రాచలం చేరుకోనున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌. .గవర్నర్‌ ఒకే సమయంలో పర్యటనకు వస్తుండటంతో..ఈ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది. వరద తీవ్రత క్రమేణా తగ్గుతూ మూడు నాలుగు రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, వదర నీటి కారణంగా అంటు వ్యాధులు ప్రబల కుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇక, గవర్నర్‌ నేరుగా ఏరియా సర్వేకు రానుండటంతో..అధికారుల నుంచి పూర్తి సమాచారం.. నష్టం పైన వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img