Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

సహకార వ్యవస్థలో రెండంచెల విధానానికి
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుకూలం

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌ కుమార్‌
రెండంచెల విధానం అమలు కోసం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్స్‌ ఎంప్లాయీస్‌ ధర్నా

విశాలాంధ్ర, హైదరాబాద్‌ : సహకార వ్యవస్థలో రెండంచెల విధానానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుకూలమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌ కుమార్‌ వెల్లడిరచారు. ఈ వ్యవస్త అమలు గురించి మంత్రులతో కలిసి సమగ్రంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సఫలీకృతం చేసేందుకు కృషి చేస్తానని, ఇప్పటికే ఈ వ్యవస్త గురించి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర సహకార బ్యాంకుల (టిఎస్‌ జిల్లా సహకార బ్యాంకు (డిసిసిబి )ల విలీనమే పలు సమస్యలకు పరిష్కార మార్గమని ఆయన అన్నారు. సహకార బ్యాంకులలో హెచ్‌ఆర్‌ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల అవుతాయని ఆయన వెల్లడిరచారు. సహకార బ్యాంకింగ్‌ రంగంలో రెండంచెల విధానంపై రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ కో`ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా సోమవారం ఇందిరాపార్క్‌ వద్ద జరిగింది. ధర్నాకు ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి, టిసిసిబిఏ అధ్యక్షులు బి.ఎస్‌.రాంబాబు అధ్యక్షత వహించగా బోయినిపల్లి వినోద్‌ కుమార్‌, సిపిఐ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌, టిసిసిబిఏ చైర్మన్‌ కె.జనార్థన్‌ రావు, వైఎస్‌ చైర్మన్‌ మల్లేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగేందర్‌, ప్రధాన కార్యదర్శి వి.సరేందర్‌ తదితరులు ప్రసంగించారు. ధర్నా ఉద్దేశించి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులతో పోటీపడి సహకార బ్యాంకులు నిలదొక్కుకుంటున్నాయని అభినందిం చారు. కొన్ని బ్యాంకులలో సమస్యలు ఉన్న మాట వాస్తమేనని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్క రించుకోవచ్చని, వాటి నాయకత్వం బాగుంటే బ్యాంకులు కూడా సజావుగా సాగుతాయన్నారు. పల్లా వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి సహకార బ్యాంకింగ్‌ వ్యవస్త దోహద పడుతుందన్నారు. ఈ వ్యవస్తలో రెండంచెల విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రస్తుతం 9 శాతం వడ్డీకి రుణాలు పొందుతున్న రైతులకు చాలా తక్కువ శాతానికే రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుందన్నారు. బి.ఎస్‌. రాంబాబు మాట్లాడుతూ రెండంచెల విధానం అమలు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేసే బాధ్యత సహకార బ్యాంకులుగా తమదేనన్నారు. రిజర్వు బ్యాంకు సిఫార్సు మేరకు ఇప్పటికే 10 రాష్ట్రాల్లో సహకార వ్యవస్తలో రెండంచెల విధానం అమలు జరుగుతున్నదని, దాని వల్ల రైతులకు, సహకార వ్యవస్తలకు ప్రయోజనం కలుగుతున్నదన్నారు. వి.ఎస్‌.బోస్‌ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సహకార బ్యాంకుల ఉద్యోగులు రెండంచెల వ్యవస్త అమలు కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. రెండంచెల విధానం అమలు కోసం రాష్ట్ర మంతివర్గం తీర్మానం చేయాలని కోరారు. సహకార వ్యవస్త విపలమైందనే ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని, సహకార బ్యాంకులకు నాయకత్వం వహిస్తున్న రాజకీయ నాయకుల వల్ల నష్టాలు వసాఉ్తన్నాయే తప్ప వ్యవస్త వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img