Friday, May 3, 2024
Friday, May 3, 2024

సాగర్‌ ఎడమ కాలువను ఇష్టారీతిన పెంచుకుంటూ పోయారు

కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ లేఖలు

సాగర్‌ ఎడమ కాలువను ఇష్టారీతిన పెంచుకుంటూ పోయారని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ఆరోపించారు. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌కు ఈఎన్‌సీ మురళీధం మంగళవారం రెండు లేఖలు రాశారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టు రిపోర్టును ఖాతరు చేయలేదని, ఏపీ చేపట్టిన పిన్నపురం ప్రాజెక్టు ఆపాలని బోర్డును కోరారు. పిన్నపురం ప్రాజెక్టుకు ఏపీ ఎలాంటి అనుమతి పొందలేదని, శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్‌ ఆవలకు భారీగా నీరు తరలిస్తోందని, ఏపీ వైఖరి వల్ల తెలంగాణలో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. 1952లో ఆంధ్రాలో ప్రతిపాదిత ఆయకట్టు 1.3లక్షల ఎకరాలేనని, ప్రాజెక్టు రిపోర్టుకు భిన్నంగా 1956 తర్వాత ఆయకట్టు పెంచారన్నారు. ఆంధ్రాలో ఆయకట్టును 3.78లక్షల ఎకరాలకు పెంచారని, తెలంగాణలో ఆయకట్టును 60వేల ఎకరాలకు తగ్గించారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img