నేడు సీఎం కెసిఆర్ 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ’’తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను.’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఈ రోజు సీఎం కేసీఆర్కు ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తి రేపింది.