Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వ హాస్టల్స్‌ లో వసతులను పర్యవేక్షిస్తున్న మైలవరం జడ్జి.

.విశాలాంధ్ర – మైలవరం : సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్ణయాల మేరకు మైలవరం మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం డి ఎన్‌ టి బాలుర హాస్టల్‌ మండల సేవాధికార సంస్థ చైర్మన్‌ జడ్జి షేక్‌ శిరీన్‌ పర్యవేక్షించారు,

తొలుత విద్యార్థులు ఉద్దేశించి జరిగిన సమావేశానికి న్యాయవాది బుద్ధవరపు వెంకటరావు అధ్యక్షత వహించగా వేదికపై హాస్టల్‌ వార్డెన్‌ హనుమానాయక్‌ పాల్గొన్నారు ముఖ్యంగా హాస్టల్స్‌ లో జరుగుతున్నటువంటి లోటు వసతి భోజనం వారికి అందవలసినటువంటి కాస్మోటిక్‌ వస్తువులు అందుతున్నాయా లేదా అనే దాని మీద విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో గత రెండు సంవత్సరాలుగా కాస్మోటిక్‌ బిల్లులు సోషల్‌ వెల్ఫేర్‌ లో ఆగిపోయి ఉన్నాయని దానివల్ల విద్యార్థులకు కాస్మోటిక్‌ వస్తువులు ఇవ్వలేకపోతున్నానని తెలిపారు భోజనం తయారీలో కుక్‌ ఏ విధంగా తయారు చేస్తుంది ఏమిటనేటి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు బాత్రూమ్స్‌ మరియు తాగునీరు సమస్యను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img