Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

జిల్లాకు నూతన అసిస్టెంట్ కలెక్టర్ రాక

: జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్)ని కలిసిన అసిస్టెంట్ కలెక్టర్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్)గారిని జిల్లాకు వచ్చిన నూతన అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న (ఐఏఎస్) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం కలెక్టరేట్ లోని అసిస్టెంట్ కలెక్టర్ ఛాంబర్ లో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న బాధ్యతలు స్వీకరించడం జరిగింది.లి

అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న వారి బయోడేటా : పేరు : బొల్లిపల్లి వినూత్న పుట్టిన తేదీ : 25-06-1995.
స్వస్థలం : అమరావతి, గుంటూరు జిల్లా. – చదువు : 10వ తరగతి ఒంగోలు.
ఇంటర్ (ఎంపిసి), చైతన్య కళాశాల, విజయవాడ.
బి.టెక్ (మెకానికల్ ఇంజనీర్), అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరు. సివిల్స్ సర్వీసెస్ కోచింగ్ : ఢిల్లీ 2023 ఐఏఎస్ బ్యాచ్..

అమ్మ : వి.సుభాషిణి, అసిస్టెంట్ డైరెక్టర్, అగ్రికల్చర్, డిపిఎం, ప్రకృతి వ్యవసాయం.
నాన్న : బి.రవి, డిప్యూటీ డైరెక్టర్, క్యాటిల్ బ్రీడింగ్ ఫామ్, చదలవాడ, ప్రకాశం జిల్లా.
సోదరి : డా.రవీన, ఎంఎస్ సర్జన్, వైజాక్.

మేనమామ : డా.రవీంద్రనాథ్ ఠాగూర్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, అనంతపురం మరియు ప్రకాశం జిల్లాలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img