Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

ఐఓబి రైల్వే పనులపై రైల్వే అధికారి కుమార్ అజిత్ రాగ్

ఆర్డీవో తిప్పే నాయక్ పరిశీలన
విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని కోన సమీపంలో గల మూడు అండర్ బ్రిడ్జ్ పనుల వద్ద ఐఓబి రైల్వే పనులపై మంగళవారం రైల్వే పెనుకొండ ఇన్చార్జ్ కుమార్ అజిత్ రాగ్, ఆర్డీవో తిప్పే నాయక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే డబ్లింగ్ పనులు అత్యవసరంగా చేయాల్సి ఉన్నందున కోన నుండి వివిధ గ్రామాలకు వెళ్లే మూడు అండర్ బ్రిడ్జిలను పరిశీలించడం జరిగిందని, ఈ మూడు బ్రిడ్జిలలో ఏదే ఒక బ్రిడ్జి ను నిర్ణయం చేసి 90 రోజుల్లో రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అందుకొరకే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వెళ్లేందుకు దారి చూపేందుకే ఈ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దాదాపు మూడు గంటల పాటు ఏ మార్గం బాగుంటుందన్న.. తలంపుతో చట్టం ప్రకారం అన్ని తనిఖీలు చేయడం జరిగిందన్నారు. సర్వేనెంబర్ 417,420,411,428 ల ఆధారంగా కొలతల ప్రకారం, తనిఖీ చేశామని తెలిపారు. త్వరలోనే రెవెన్యూ విభాగం ద్వారా రైల్వే అధికారులకు నివేదిక పంపి రైల్వే డబ్లింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నై కొత్తపల్లి ఎమ్మార్వో సుబ్బలక్ష్మి, సి ఎస్ జి టి అనురాధ, సర్వేయర్ అంజన్నప్ప, మండల సర్వేయర్ సంతోషిమాత, వీఆర్వో తులసి, సచివాలయ సర్వేయర్ల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img