Friday, April 26, 2024
Friday, April 26, 2024

డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు…

మరో 30ఏళ్లు జగనే మన సీఎం
సిట్ భయాందోళనలోచంద్రబాబు:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర

విశాలాంధ్ర- పార్వతీపురం: డిసెంబర్ నెలలోలేదా జనవరి నెలలో ఎన్నికలు జరుగుతాయని, మరో 30ఏళ్లు జగనే మన సీఎం అని రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖామంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు.శుక్రవారం పార్వతీపురం ఎమ్మెల్యే అలజింగి. జోగారావు క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 14ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు కంటే 4ఏళ్లు సీఎంగా చేస్తున్న జగన్ పరిపాలన దేశంలో అందరికి ఆదర్శమని చెప్పారు. సిట్ ఏర్పాటు తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబులో భయాందోళన పెరిగి రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్ కో రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో 17వేలజగనన్న కాలనీలు ఏర్పాటు చేసిన ఘనత, 70వేల ఎకరాలు ఇళ్ళ స్థలాల కోసం కేటాయించిన ఘనత,31లక్షల ఇళ్లు నిర్మించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.62లక్షల మందికి ఒకేదపా పింఛన్లు అందజేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలవద్దకు నేరుగా తీసుకుని వెళ్తున్న వాలంటీర్ల సేవలను చూసి ఓర్వలేక చంద్రబాబు రకరకాలుగా మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నట్లు చెప్పారు. అదికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు,లోకేష్, అచ్చెన్నాయుడులు రద్దు చేస్తామని ఇదివరకే చెప్పారన్నారు. అమరావతిని భ్రమారావతి చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనని తెలిపారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను చూసి, ప్రజలు విజ్ఞతతో ఆలోచనచేసి రానున్న ఎన్నికల్లో ఓటువేయండని తెలిపారు. గతప్రభుత్వంలో మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయంను పాచిపెంటలో పెట్టమని తానుకోరగా, గిరిజనులు, గిరిజన ప్రాంతాలులేని ఎస్.కోటలో ఏర్పాటుచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దీన్ని త్వరలో జూన్ నెలలో సాలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి విచ్చేసి ప్రారంభం చేస్తారని తెలిపారు. దమ్మున్ననేత,పులివెందుల పులి జగన్ అయితే, కలయికల కోసం, కుట్రలకోసం ఆలోచనచేసే నేత చంద్రబాబని చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నశ్రీను,పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు జోగారావు, కళావతి, ఎమ్మెల్సీలు పాలవలస విక్రమ్, ఇందుకూరి రఘురాజు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వాకాడ నాగేశ్వర రావు , పార్వతీపురం నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img