Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంట నష్టాన్ని గుర్తించాలి: జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లాలో పంట నష్టాన్ని గుర్తించాలని, దీంతో పాటు జిల్లా శతశాతం ఇ-క్రాప్,ఇ- కెవైసీ, పీఎం కిసాన్, వైయస్ఆర్ యాప్ పనితీరు నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధశాఖల మండల స్థాయి అధికారులతో మంగళవారంనాడు జిల్లా కలెక్టరు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ను వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రాబర్ట్ పాల్ తో కలిసి నిర్వహించారు. వ్యవసాయ మరియు అనుబంధ శాఖలైన ఉద్యానవన, పశు సంవర్దక, మత్స్య శాఖ, మైక్రో ఇరిగేషన్ శాఖలలో అమలవుచున్న పధకాల పురోగతిపై జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇకెవైసీ పూర్తి కాని ప్రాంతాలపై దృష్టి సారించి తక్షణమే పూర్తిచేయాలన్నారు. మండల వ్యవసాయఅధికారులు ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి,లక్ష్యాలు సమీక్షించాలని తెలిపారు. శతశాతం ఇ-క్రాప్, ఇ- కెవైసీ నమోదుచేయించాలని, లేనిచో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కాలంలో వర్షాలు తరుచుగా పడడంవల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాలకు సంబంధిత అధికారులువెళ్లి పంటనష్టాన్ని గుర్తించాలన్నారు. తరుచుగా పడుతున్న వర్షాలు కారణంగా సంబందించిన అధికారులు, సిబ్బంది సెలవులు పెట్టరాదని ఆదేశించారు. పంట నష్టంపై ప్రభుత్వం అందిస్తున్న నష్టం పరిహారంపై రైతులకు పూర్తిఅవగాహనకల్పించి, రైతులు లాభం పొందేవిధంగా చూడాలన్నారు. రైతులకు పంటలపై సూచనలు,సలహాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో రైతుభరోసా కేంద్రాలలో ఏర్పాటుచేస్తున్న కస్టమర్ హైరింగ్ సెంటర్లకు అవసరమగు పరికరాలు అందించాలన్నారు.పశు సంవర్దక శాఖకు సంబంధించి జిల్లాలో పాలఉత్పత్తి పెరిగే విధంగాచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img