Friday, May 17, 2024
Friday, May 17, 2024

ప్రభుత్వ నిబంధన ప్రకారమే పెన్షన్ పంపిణీ

కమిషనర్ మల్లయ్య నాయుడు

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న కారణంగా మే, జూన్ నెలలకు గాను ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాల ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పింఛన్దారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ ఎం ఎం నాయుడు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బంది, సచివాలయ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, మంచం పట్టిన వారు, చక్రాల కుర్చీలకు పరిమితమైన వారు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్లను ఇంటింటికి సచివాలయ సిబ్బంది ఒకటో తేదీన అందజేస్తారని చెప్పారు. ఆయా జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. మిగిలినవారికి నేరుగా డిబిటి విధానం ద్వారా వారి అకౌంట్లో మే ఒకటో తేదీన పెన్షన్ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందన్నారు. ఇంటింటికి పెన్షన్ ఇచ్చే వారి వివరాలు డిబిటీ ద్వారా పెన్షన్ జమ చేసే వారి వివరాలు సచివాలయాలలో ఉంచడం జరుగుతుందన్నారు. డిబిటి విధానంలో 17,604 మంది, డిబిటి కానివారు 5,840 మంది ఉన్నారన్నారు. పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ సచివాలయాలు లేదా ఇతర కార్యాలయాలకు వెళ్ళనవసరం లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈ విషయంలో సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img