Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మెయిన్ రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ వెలగక ప్రజలు నానా అవస్థలు

రాజాం (విజయనగరం జిల్లా ): రాజాం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సెంటర్ స్ట్రీట్ లైటింగ్ గత కొద్ది రోజులుగా వెలగటలేదు. రోడ్డుకు రెండు వైపులా వెలగవలసిన లైట్లు
వెలగకపోవడంతో మెయిన్ రోడ్డు అంధకారంగా తయారవుతున్నది. రోడ్డుపక్కన ఉన్నటువంటి షాపులు సుమారు రాత్రి 9 గంటల సమయంలో
మూసివేయడంతో రోడ్డుపై లైటింగ్ లేక రోడ్డుపై నడిచి వెళ్లే వాళ్లు ఈ
చీకట్లో ఏ వాహనాలు వచ్చి మమ్మల్ని ఢీకొంటాయోనని భయానికి గురవుతున్నారు. రోడ్డుపైన లైటింగ్ లేక పశువులు రోడ్డు మీద తిష్ట వేస్తున్నాయి, గతంలో పశువులను గుర్తు తెలియని వాహనాలు ఢీకొని
వెళ్లిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు కూడా
జరిగి ఉన్నాయి. గత రెండు నెలల క్రితం కొత్తగా బదిలీపై వచ్చిన
కమిషనర్ జె.రామ అప్పలనాయుడు సెంట్రల్ లైటింగ్ పై దృష్టి పెట్టి లైట్లు
వెలిగేటట్లు చేయించినా మళ్లీ కొద్ది రోజుల్లో మళ్లీ యధా స్థితికి వచ్చాయి.
కావున అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా
పర్మినెంట్ గా పనులు చేయాలని, ఈ రోడ్డుపై ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ లో ఉండే లైట్లు రెండు పక్కల అన్ని లైట్లు వెలుగు టట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img