Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఈనెల 14నుండి చట్టబద్ద గ్రామసభలు నిర్వహణ: ఈఓపిఆర్డీ వర్మ

విశాలాంధ్ర,సీతానగరం: ఈనెల 14నుండి వారం రోజులపాటు అన్ని గ్రామ పంచాయతీలో అందరు కార్యదర్శులు చట్టబద్ధ గ్రామసభలను సర్పంచులు అధ్యక్షతన నిర్వహించాలని మండల పంచాయతీ విస్తరణ అధికారి కెకెకె వర్మ తెలిపారు.జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ ఆదేశాలమేరకు షెడ్యూల్ ప్రాప్తికి సంబందించి వివిధ శాఖల‌ సిబ్బందికి మరియు గ్రామ సర్పంచ్ కు, ఎంపీటీసీకు సమాచారాన్ని నోటీసు పూర్వకంగా తెలియచేసి సభలు నిర్వహించవలసినదిగా కోరారు. గ్రామ సభలను తనతో పాటు ఎంపిడిఓ,తహశీల్దార్ తదితర మండల అధికారులు సందర్శన చేస్తారని చెప్పారు. ఈ క్రింది అంశాలను గ్రామ సభలో తెలియజేస్తామన్నారు. పంచాయతీలు, సహకార సంఘాలు, స్వచ్చంద సంస్థలు, ప్రజల సహకారంతో సామాజిక అభివృద్ధి క్రింద అన్ని కార్యక్రమాల అమలుగూర్చి చర్చ ఉంటుందన్నారు.
వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపర్చడానికి అవసరమైన అన్నిటిని చేయడం ప్రత్యేకించి మెరుగైన విత్తనాల అభివృద్ధి, ఎరువుల సరఫరా పంపిణీ. మెరుగైన సాంకేతికతలను, పద్ధతులను, ఆచరణలను మెరుగైన పనిముట్లను వ్యాప్తిలోకి తేవడం. పచ్చి ఎరువులో స్వయం సమృద్ధిని సాధించడం పొలంలో పశువుల ఎరువును రూపొందించడం,పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించడం.భూమి పునస్సంపాదన, భూసారసంరక్షణ. వ్యవసాయం నిమిత్తం పరపతినిసమకూర్చడం.మొక్కల సంరక్షణ పద్ధతులను ప్రచారం చేసి సహాయపడటం.ప్రదర్శన ప్లాట్లను రుపొందించి, పంట నిర్వహణలో మెరుగైన పద్ధతులను ఆవిష్కరించడం. బావుల, పునరుద్ధరణ, త్రవ్వకం ద్వారా సాగునీటి క్రింద మరింత విస్తీర్ణాన్ని తీసుకొని రావడం, ప్రయివేటు చెరువుల మరమ్మత్తులు, త్రవ్వకం, ప్రభుత్వ చిన్న తరహ సాగు వనరులు, నీటికాలువల నిర్వహణ.
వ్యవసాయం నిమిత్తం అధిక విద్యుత్తు వినియోగం. బావుల త్రవ్వకం, ఫిల్టర్ పాయింట్ల లు బోరుబావుల ద్వారా భూగర్భ నీటి వనరుల పూర్తి వినియోగం. చెట్ల పెంపకం, గ్రామీణ అడవులను పెంచడం.
పశు సంవర్ధన, మత్స్య పరిశ్రమలు :-
ఉత్తమ జాతి ఆబోతులను ప్రవేశపెట్టడం, సాధారణ ఎద్దుల విత్తుకొట్టడం ద్వారా స్థానిక పశువులను అభివృద్ధిపరచడం. పశువుల, గొర్రెలు, పందులు, పౌల్ట్రీల మెరుగైన జాతులను ప్రవేశపెట్టడం.
వ్యవస్థీకృత సంరక్షణ ద్వారా అంటువ్యాధులను నియంత్రించడం. మెరుగైన పశుగ్రాసం, మేతను ప్రవేశపెట్టడం.కృత్రిమ గర్భధారణ కేంద్రాలు, ప్రధమ చికిత్సా కేంద్రాలు, చిన్న తరహా వెటర్నరీ డిస్పెన్సరీలను ఏర్పాటు చేసి,నిర్వహించడం. పాలు, బండిలాగడం రెంటి కోసం మెరుగైన పశువుల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహనను కల్పించడం. ఆరోగ్య, గ్రామీణ పారిశుద్ధ్యం :-
ప్రస్తుతమున్న వైద్య, ఆరోగ్య సర్వీసులను విస్తరించి, వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకొనిరావడం.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి కేంద్రాలను ఏర్పాటు చేసి, నిర్వహించడం.
సురక్షిత త్రాగునీటి సౌకర్యాలను సమకూర్చడం.వ్యవస్థీకృత టీకాలను వేసేలా చూడటం.
అంటువ్యాధులను నియంత్రించడం. గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని భవనాల నిర్మాణం, మరమ్మతులు నిర్వహణ, (మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పరిధిలోని రోడ్లను, జాతీయ, రాష్ట్ర రహదారులుగా ప్రభుత్వం వర్గీకరించిన రోడ్లను, మినహాయించి) గ్రామాల్లోని అన్ని ప్రభుత్వము రోడ్లు అట్టి రోడ్లపై అన్ని వంతెనలు, కల్వర్టులు, రోడ్లు, డ్యామ్, కాలిబాటలు, ప్రభుత్వ రోడ్లు, బహిరంగ ప్రాంతాల విద్యుద్దీకరణ మురుగు కాలువల నిర్మాణం, వాటి నిర్వహణ, మురుగునీటి, మురికి నీటి విసర్జన.వీధులను శుభ్రపరచడం, చెత్తకుప్పలు, పిచ్చిచెట్లు, ముళ్లకంపల తొలగింపు, వినియోగించని బావులు,
అపరిశుభ్రచెరువులు, గుంతలు, లోయలు లేదా గోతులను పూడ్చడం, గ్రామంలోని పారిశుద్ధ పరిస్థితికి ఇతర మెరుగులు. పబ్లిక్ మరుగుదొడ్ల ఏర్పాట్లు, పబ్లిక్ లేదా ప్రయివేటు అయినా మరుగుదొడ్లను శుభ్రపరచుటకు ఏర్పాట్లు. దహన సంస్కారం, స్మశాన వాటికలను ప్రారంభించి నిర్వహించడం, దిక్కులేని మానవ లేదా జంతువుల శవాల విసర్జన. ఏదేని అంటువ్యాధులు లేదా మలేరియాకు సంబంధించిన వాటి నివారణ, ప్రత్యుపాయ చర్యలు. బావుల త్రవ్వకం, మరమ్మతులు, నీటి గుంటలు లేదా చెరువుల తవ్వకం, మరమ్మతు, నిర్వహణ, కడగడం, స్నానాల కోసం నీటి సరఫరాకు త్రాగునీటి ప్రయోజనాల కోసం నీటి సరఫరాకు త్రాగునీటి ప్రయోజనాల కోసం సంరక్షిత నీటి విభాగాల నిర్మాణాలు, నిర్వహణ.ఎరువు సంబంధిత వనరుల సంరక్షణ, పశువుల ఎరువుల తయారీ, ఎరువుల విక్రయం.జనన మరణాల నమోదు.పశువుల తోట్ల ఏర్పాటు, నిర్వహణ,ఈచట్టం క్రింద లేదా ఏదేని ఇతర చట్టం ద్వారా తప్పనిసరి అని స్పష్టంగా ప్రకటించిన అన్ని ఇతర అంశాల చర్చ ఉంటుందని తెలిపారు. ఉపవిభాగం (1) లో నిర్ధిష్టపరిచిన అంశాలు కాకుండా, ఇందుకు సంబంధించి చేసిన అట్టి నియమాలకు లోబడి 1వ షెడ్యూల్ లో నిర్దిష్టపరిచిన అంశాలకు సంబంధించి ఏదేని విధులను గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అప్పగించవచ్చుననితెలిపారు.. గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీలు వనరుల ప్రణాళికను చేపట్టాలి.
1వ ఉప విభాగంలో నిర్దిష్టపరచిన ఏదేని అంశాలకు సంబంధించిన వైఫల్యం లేదా విధుల అమలలో ఎటువంటి నష్టపరిహారపు అభియోగాన్ని ఏదేని గ్రామ పంచాయతీ కార్యనిర్వహక అధారిటీ, అధికారులు లేదా గ్రామ పంచాయతీ ఉద్యోగులపై మోపకూడదన్నారు. చట్ట బద్ద గ్రామసభలలో పాల్గొని పంచాయతీ రాజ్ చట్టం తెలియ జేస్తున్న విధి విధానాలు తెలుసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img