Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు పోలవరం విద్యార్థులు….

పోలవరం పిఎస్సిఎస్‌ చైర్పర్సన్‌ చెలికాని బాబ్జి…
విశాలాంధ్ర`చాట్రాయి : రాష్ట్ర స్థాయి పోటీలకు పోలవరం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ విద్యార్థులు ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందని పోలవరం పిఎస్సిఎస్‌ చైర్పర్సన్‌ చెలికాని బాబ్జి కొనియాడారు. ఇటీవల గుడివాడలో జరిగిన అండర్‌ 14, 17 బాలుర విభాగంలో వివిధ పోటీలలో 4 గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో ఆయన విద్యార్థులను అభినందించారు. మన గ్రామానికి మండలానికి మీ ప్రతిభాపాటవాలతో మంచి గుర్తింపు తీసుకురావాలని అభిలషించారు.విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img