Monday, October 3, 2022
Monday, October 3, 2022

వరి నాట్లు పూర్తి

లింగపాలెం : లింగపాలెం మండలంలో వరి నాట్లు వేయడం పూర్తయ్యిందని మండల వ్యవసాయాధికారి మురళీకృష్ణ తెలిపారు. మండలంలో దాదాపు 7 వేల 500 ఎకరాలలో నాట్లు వేశారని వివరించారు. సకాలంలోనే నాట్లు పడ్డాయని, వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో వేసిన నాట్లు నీటి ఇబ్బంది లేకుండా ఉందని అన్నారు. ఇ`క్రాఫ్‌ నమోదు కార్యక్రమం ప్రతీ సచివాలయ పరిధిలో జరుగుతుందని, ఈ నెలాఖరులోపు ప్రతీ రైతు ఇ`క్రాఫ్‌ నమోదు చేసుకోవాలని వివరించారు. పిఎం కిసాన్‌ యోజన పథకానికి అర్హులైన వారు ఈకెవైసీ చేయించుకోవాలని, ఈనెల 15లోగా దీనిని పూర్తి చేసుకోవాలని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img