Monday, September 26, 2022
Monday, September 26, 2022

రైతులు తప్పనిసరిగా ఈ- క్రాప్ నమోదు చేయించుకోవాలి

గణపవరం: రైతులు ప్రతి గ్రామంలోనూ వరి పంట పొలాల వద్ద ఈ-క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి యర్రంశెట్టి వెంకట సత్యనారాయణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం గణపవరం మండలం ముగ్గుళ్ళ గ్రామంలో పంట నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బొడ్డు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఖరీఫ్ 2022 పంట నమోదు ప్రక్రియను వీఆర్వో, వీఆర్ఏ కలిసి వరి పండించే రైతులకు ఎటువంటి తప్పులు లేకుండా
ధాన్యం కొనుగోలు కి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు ,గ్రామ సర్పంచ్ ,రెవిన్యూ శాఖ, సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img