Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చేనేత హస్త కళలను ప్రోత్సహించాలి

ఏలూరు:చేనేత హస్త కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక సత్రంపాడు శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో స్వదేశీ హ్యాండీ క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, అమ్మకాలను మేయర్ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సాంప్రదాయాలను వదలకుండా కుటుంబమంతా ఎంతో కష్టపడి చేనేత చీరలను, కొండపల్లి బొమ్మలను వంటి వస్తువులను తయారు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేనేత ఉత్పత్తిదారులకు ప్రత్యేకమైన రాయితీలు కల్పిస్తూ అధునాతన మిషనరీని అందజేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్క చేనేత కార్మికునికి పింఛన్ అందజేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత రోజుల్లో వీటికి ప్రజల ఆదరణ కరువైందనీ, ఉత్పత్తిదారుల జీవనోపాధి భారమైందని దాంతో ఇలా సొసైటీగా ఏర్పడి రాష్ట్రమంతా తిరుగుతూ చేనేత ఉత్పత్తులను అమ్మకాలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొని వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అన్నపనేని భారతి, నిర్వాహకులు రాంబాబు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img