Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్న మోడీ

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ
ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్న మోడీ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ

నూజివీడు టౌన్: ఆర్ఎస్ఎస్ అజెండాను దేశ ప్రజలపై మోడీ రుద్దుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. సిపిఐ నూజివీడు నియోజకవర్గ 24వ మహాసభలు మండలం లోని దిగవల్లి గ్రామంలో అమరజీవి కొల్లి నాగేశ్వరరావు ప్రాంగణంలో ఇందుపల్లి సత్య ప్రకాష్, గుంటక ధర్మారెడ్డి, మడుపల్లి నాగేందర్రావు అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా హిందూ భావజాలంతో నడుస్తుందన్నారు . కార్పొరేట్ శక్తులుకు పెద్ద స్థాయిలో ఆదాయం దోచిపెడుతుందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు పూర్తిగా పేదరికంలోకి దిగజారితే కార్పొరేట్ శక్తులు తమ ఆదాయాన్ని 34 శాతం పైగా పెంచుకున్నారన్నారు . 2014 నుండి నేటి వరకు అన్ని రకాల వస్తువులు , గ్యాస్, ఇంధనం రేట్లు పెరిగిపోయాయన్నారు . ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని మోడీ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతున్నారన్నారు. శ్రామిక వర్గం సృష్టించిన సంపదను బడా బాబులకు దోచిపెడుతుందన్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘాలని ,న్యాయ సంస్థలను ,మోడీ ప్రభుత్వం ప్రభావితం చేస్తూ నిర్వీర్యం విమర్శించారు. పోలీస్ ,ఈ డి, ఆదాయ పన్నుల శాఖల అధికారులను ప్రతిపక్ష నాయకులపై దాడులు నిర్వహింప చేస్తున్నారన్నారు. లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ, మత విద్వేషాలను, మతతత్వ శక్తులను రెచ్చగొడుతుందని విమర్శించారు . రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం, మోడీ అడుగుజాడల్లో నడుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిపిఐ తో పాటు అన్ని ప్రజా సంఘాలు కలిసి రావాలని కోరారు. కార్మిక, ప్రజా వ్యతిరేక, నియంత విధానాలు నివారించాల్సిన రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నాయకులు చోద్యం చూస్తున్నారన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎర్ర జెండా ఆధ్వర్యంలో పోరాట నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మతోన్మాద విధానాల అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు కమ్యూనిస్టు పార్టీలతో ఇతర పార్టీలు ప్రజలు కలిసి రావాలని ఆమె కోరారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలో అబద్దాల చక్రవర్తిగా మోడీ పేరుగాంచారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని మోడీ అమలుపరచలేదన్నారు. కేంద్రం చేపట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ శివారులో రైతులు చేపట్టిన ఏడాదికాల పోరాటాలు కమ్యూనిస్టు పార్టీలకు కూడా స్ఫూర్తినిచ్చాయన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని రాష్ట్రంలో జగన్ అమలు పరచడం తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకునెందుకే నని విమర్శించారు. నూజివీడు ప్రాంతం భూ పోరాటాలకు పేరుగాంచిన్నారు. మహాసభల్లో పెద్ద ఎత్తున ప్రజల పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరిస్తున్నాయన్నారు . ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు . సమస్యలపై పోరాటాలు జరిగితే తప్ప పరిష్కారం కావని ఆయన అన్నారు. సిపిఐ సీనియర్ నాయకులు కొమ్మన నాగేశ్వరరావు మాట్లాడుతూ నూజివీడు ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలకు సిపిఐ అమ్మ వంటిదని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిపిఐ కార్యకర్తలకు సైదాంతిక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నూజివీడు ప్రాంతంలో సాగునీరు కోసం ,చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాల సేకరణ ,ధర్నాలు నిర్వహించాలని అందుకు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో ఎన్నో పోరాటాల నిర్వహించి పేదలకు భూములు అందించిన పార్టీ సిపిఐ అన్నారు. అనంతరం రైతు సంఘం నాయకులు రాయకుల లక్ష్మణరావు పార్టీచేపట్టునున్న కార్యక్రమాలు పై తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.

అమరవీరుల స్థూపాల వద్ద పతాకావిష్కరణ..

మహా సభల ప్రారంభానికి ముందు దిగవల్లి గ్రామంలోని అమర జీవుల స్తూపాల వద్ద పతాకావిష్కరణ చేశారు . సిపిఐ సీనియర్ నాయకులు అమర జీవి జగ్గవరపు చిన్న సూరారెడ్డి స్తూపం వద్ద మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు . అమరజీవి బూరుగు వెంకటేశం స్తూపం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ ఆవిష్కరించి నివాళులర్పించారు .

నూజివీడు నియోజకవర్గ సమితి నూతన కౌన్సిల్ ఎన్నిక:

24 వ మహాసభలు నూజివీడు నియోజకవర్గ సమితి నూతన కమిటీ ఎన్నిక జరిగింది . సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని వెంకట రామారావు 39 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ప్రతిపాదించగా సభ ఆమోదించింది .కమిటీలో నియోజకవర్గ కార్యదర్శిగా బత్తుల వెంకటేశ్వరరావు తో పాటు 12 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సీనియర్ సభ్యులకు సన్మానం:
నూజివీడు నియోజకవర్గం పరిధిలోని సీనియర్ సభ్యులను మహాసభ ఘనంగా సన్మానించింది. నాయకులు సీనియర్ సభ్యులను దృశ్యాలతో సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img