Friday, April 26, 2024
Friday, April 26, 2024

బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలి

సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు

ఉండి: మహిళలను గౌరవిస్తాం, మహిళలను వేధిస్తూ అత్యాచారాలకు పాల్పడుతూ, హత్యలు చేస్తున్న మానవ మృగాలపట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెపుతూ మరొక ప్రక్క సత్ప్రవర్తన పేరుతో క్షమాభిక్ష పెడుతున్న బిజెపి నాయకుల ద్వంద్వ ప్రమాణాలకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు.మంగళవారం ఉండి మార్కెట్ యార్డు నందు జరిగిన పశ్చిమగోదావరి జిల్లా మహిళా సమాఖ్య జిల్లా సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సమావేశానికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ అధ్యక్షత వహించారు.భీమారావు మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయడం లేదన్నారు.మహిళల సాధికారత గురించి నిత్యం మాట్లాడే ప్రధాని నరేంద్రమోడీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చట్టం ఎందుకు ఆమోదించరని ప్రశ్నించారు.మహిళలపట్ల వివక్ష, పెరుగుతున్న అఘాయిత్యాల నిరోధానికి మహిళా సమాఖ్య నిరంతర పోరాటాలకు సమాయత్తం కావాలని కోరారు.మహిళా ఉద్యమాలకు సీపీఐ వెన్నుదన్నుగా నిలుస్తుందని భీమారావు అన్నారు.
మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి సభ్యురాలు సికిలే పుష్పకుమారి, జిల్లా నాయకులు మామిడిశెట్టి విజయలక్ష్మి,సావారపు దేవి, టి.గంగాభవాని,సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు సనపల శ్రీను,ఎం.లక్ష్మీపతి,మండల నాగేశ్వరరావు,ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.అప్పలస్వామి తదితరులు మాట్లాడారు.

మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా నూతన కమిటీ ఎన్నిక…

మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా నెక్కంటి జగదాంబ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సికిలే పుష్పకుమారి, ఉపాధ్యక్షులుగా మామిడిశెట్టి విజయలక్ష్మి, సావారపు దేవి,సహాయ కార్యదర్శిగా యర్రంశెట్టి శాంతమ్మ లతో పాటు మరో 15 మంది జిల్లా కమిటీ సభ్యులు సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img