Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరపటం పట్ల తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం…

విశాలాంధ్ర- ఉండి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఉండి మండలం
వెలివర్రులో గ్రామంలో టిడిపి నాయకుడు ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరపటం పట్ల తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా తమ్ముళ్ల లా ఉన్న తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు పండుగలు ఆంధ్రప్రదేశ్ లో జరపడం రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని తెలుగు తమ్ముళ్లు దూషిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని ఉండి మండలం వెలివర్రు గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు దండు సుబ్బరాజు శుక్రవారం వెలువరు గ్రామ దేవత అయిన వీర పేరంటాల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుబ్బరాజు నివాసం వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టిడిపి సీనియర్ నాయకుడుగా ఉన్న సుబ్బరాజు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు పుట్టినరోజులు జరుపుకో లేరు కాని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, చీకటిలోకి నెట్టేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని పలువురు మండిపడ్డారు. తెలంగాణలో టిడిపిని భూస్థాపితం చేసిన కేసీఆర్ పుట్టినరోజు పండుగలు జరుపుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పట్ల నాయకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలన్నారు. కెసిఆర్ పట్ల అభిమానం ఉంటే తెలంగాణలో చూసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ లో కాదని ధ్వజమెత్తారు. ఇటువంటి సంఘటనల రీత్యా ఆనాడు మాజీ ప్రధాని సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు అనడంలో తప్పేమీ లేదని ఈ కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img