Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రోడ్డు ప్రమాదాలతో రూ.2.91 లక్షల కోట్ల నష్టం

సామాజిక-ఆర్థిక వ్యయంపై బాష్‌ అధ్యయనం

న్యూదిల్లీ : దేశ సామాజికఆర్థిక రంగాలపై రహదారి ప్రమాదాలు తీవ్ర ప్రభావం కలిగిస్తున్నాయని వెల్లడయ్యింది. దేశంలో రోడ్డు ప్రమాదాల ఫలితంగా మొత్తం సామాజిక-ఆర్థిక వ్యయం 15.71- 38.81 బిలియన్‌ డాలర్ల (రూ.1.17 లక్షల కోట్ల నుండి రూ.2.91 లక్షల కోట్లు) మధ్య ఉంటుందని ఆటో కాంపోనెంట్‌ మేజర్‌ బాష్‌ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. గత రెండు దశాబ్దాల వాహన ప్రమాదాల డేటా ఆధారంగా ‘బాష్‌ ఇండియా అడ్వాన్స్డ్‌ అటానమస్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ అండ్‌ కార్పొరేట్‌ రీసెర్చ్‌’ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇది సరైన భద్రతా ప్రమాణాలు పాటించడానికి, నూతన ఉత్పత్తులను గుర్తించడానికి, వ్యాపార వ్యూహాలు రూపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా మొత్తం సామాజిక-ఆర్థిక వ్యయం రూ.1.17 లక్షల కోట్ల నుండి రూ.2.91 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో 0.55-1.35 శాతంగా అంచనా వేయబడిరది’ అని తెలిపింది. రోడ్‌ యాక్సిడెంట్‌ శాంప్లింగ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌ఏఎస్‌ఎస్‌ఐ) వివరాల ప్రకారం, 2019లో దాదాపు 781,668 వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నాయని, దీని నష్టం మొత్తం 0.57-1.81 బిలియన్‌ డాలర్లు అని పేర్కొంది. అధ్యయన ఫలితాల ప్రకారం వాణిజ్య వాహనాలకు 356.2 మిలియన్‌ డాలర్లు, కార్లకు 69.8 మిలియన్‌ డాలర్లు, ద్విచక్ర వాహనాలకు 18.7 మిలియన్‌ డాలర్లు, బస్సులకు 39.6 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. అలాగే, 2019లో రోడ్డు ప్రమాదాల బాధితుల మొత్తం వైద్య ఖర్చు దాదాపు 0.821.92 బిలియన్‌ డాలర్లు కాగా, 2019లో పురుషుల మరణాల కారణంగా మొత్తం ఉత్పాదకత నష్టం 10.9 బిలియన్‌ డాలర్లు. మహిళ మరణాలతో 1.44 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధ్యయనం వెల్లడిరచింది. అంతేకాకుండా, తీవ్రమైన గాయాల కారణంగా 2019 సంవత్సరంలో మొత్తం ఉత్పాదకత నష్టం 123 మిలియన్‌ డాలర్లు కాగా, చిన్న గాయాలతో 14 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ‘రోడ్డు ప్రమాదాలతో తలెత్తే సామాజిక`ఆర్థిక, వైద్యపరమైన ఖర్చులు చాలామందిని ఇబ్బందికి గురి చేస్తాయి. వీటిని తగ్గించడం కీలకం. ఇందుకు సంబంధించిన డేటా సరిగా లేదు. అందుకే ఈ అధ్యయనం చేశాం’ అని ఈ పరిశోధనలో పాల్గొన్న బాష్‌ సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ గిరికుమార్‌ తెలిపారు. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సామాజిక-ఆర్థిక నష్టాన్ని అంచనా వేయడానికి ప్రపంచ బ్యాంక్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌, బాష్‌ వినూత్న పద్ధతి ద్వారా 50కి పైగా అంతర్జాతీయ జర్నల్‌ల అధ్యయనాలను కలిపి రెండు సంవత్సరాల కృషికి ఈ పరిశోధన నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ నివేదిక ఫ్లీట్‌ ఆపరేటర్లు, రవాణా అధికారులకు ప్రమాద పరిస్థితుల కచ్చితమైన వీక్షణను అందిస్తుందని పేర్కొంది. అలాగే భారతదేశ రహదారులను సురక్షితంగా చేయడానికి సాంకేతిక ఆవిష్కరణలు, విధానాలను రూపొందించడానికి దోహదపడుతుందని వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img