మంత్రి హరీశ్‌రావు
రాష్ట్ర మహిళలకు మంత్రి హరీశ్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. .‘తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ. ఈ గొప్పపండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అని మంత్రి హరీశ్ ట్విటర్లో పోస్టు చేశారు.