Monday, May 6, 2024
Monday, May 6, 2024

40 శాతం మందికి వాక్సిన్‌ లక్ష్యం

ఐరాస : ఈ ఏడాది చివరి నాటికి 40 శాతం మందికి వాక్సిన్‌ అందించి రోగనిరోధక శక్తిని పెంపొందించే ప్రపంచ కొవిడ్‌ `19 వాక్సిన్ల పంపిణీ వ్యూహాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోని యోగు టెర్రస్‌ విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రాస్‌ అధనామ్‌ చెబ్రియాసిస్‌తో కలిసి ఈ వ్యూహాన్ని ఆవిష్కరించారు. 2022 మధ్యకాలం నాటికి ప్రపంచ ప్రజల్లో 70శాతం మందిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంపై శ్రద్ధ వహిస్తామని ఇరువూరు తెలిపారు. అయితే ఆశాభావమైన ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి అనేక అడ్డంకులను అధిగమించవలసి ఉంటుందన్నారు.
వాక్సిన్‌ల నిల్వలు, జాతీయ కరణలాంటి ఆటంకాలను అధిగమించాలని, అంతర్జాతీయ అన్ని దేశాలు కలిసికట్టు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచాలని కోరారు. కలిసి పనిచేస్తే తక్కువ ధరకు వాక్సిన్‌ అందుతుందని, కొవిడ్‌ మహమ్మారి నుండి తేలికగా బయటపడవచ్చు.నని వారు చెప్పారు. వాక్సిన్‌ డోస్‌ల్లో భాగస్వామ్య, సాంకేతికల బదిలీ, ప్రాధాన్యతననుసరించి కార్యాచరణలు తీసుకున్నట్లయితే మరణాల రేటును, ప్రమాదకరమైన కొత్త వేరియంట్లను నిరోధించవచ్చునన్నారు. ప్రస్తుతం నెలకు 1.5 బిలియన్ల వాక్సిన్‌ డోస్‌లు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. వీటి ద్వారా ఏడాది చివరకు 40 శాతం ప్రజలకు వాక్సిన్‌లు పంపిణీ చేయవచ్చునని వారు చెప్పారు. వాక్సిన్ల పంపిణీ సమంగా జరగాలని, అప్పుడే ఈ ప్రణాళిక విజయవంతమవుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img