Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తెలుగుకి ఇప్పుడు కాదు..ఎప్పుడో అన్యాయం జరిగింది : లక్ష్మీ పార్వతి

ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీషు మీడియం తెచ్చారని చాలా గొడవ చేస్తున్నారని, తెలుగుకి ఇప్పుడు కాదు ఎప్పుడో అన్యాయం జరిగిందని తెలుగు సంస్కృత అకాడమి ఛైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతి అన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భాషా చైతన్య సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుకి ఎప్పుడో అన్యాయం జరిగిందని, ఇంగ్లీషు మీడియం స్కూల్‌లు కాలేజీలు రావడంతో తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగిందని అన్నారు. దీంతో ప్రభుత్వ స్కూళ్ళు మూత పడే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వాలు ఇంగ్లీషు మీడియంలో తెలుగు భాషను తప్పని సరి చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఒక సబ్జెక్టు తెలుగు తప్పని సరి చేసిందన్నారు. దాని వలన మాతృ భాషకు, తెలుగుకు స్థానం దక్కిందన్నారు. దీన్ని తప్పుబడుతున్న వారి పిల్లలంతా ఇంగ్లీషు మీడియం స్కూళ్లలొనే చదువుతున్నారని ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img