Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఆ రైతుల మరణాల రికార్డులు లేవు

ఆర్థిక సాయం అందించడం కుదరదు : కేంద్రం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన ఆందోళనల్లో మరణించిన 750 మంది రైతులకు ఆర్థిక సాయం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. . సుమారు ఓ సంవత్సరం నుంచి ఢల్లీి సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని, వీరిలో కొందరు రైతులు మరణించారని, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే ఆలోచన ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించింది.దీనిపై నరేంద్ర సింగ్‌ తోమర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢల్లీి సరిహద్దుల్లో ఆందోళన చేస్తూ మరణించిన రైతులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి రికార్డులు లేవని, కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి తోమర్‌ పేర్కొన్నారు. . ఈ ప్రకటనను కాంగ్రెస్‌ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టారు. రైతుల మరణాలకు సంబంధించి రికార్డులు లేవని చెప్పడం వారికి తీవ్ర అవమానమన్నారు. కేంద్రం అలాంటి ప్రకటన ఎలా చేస్తుందని ప్రశ్నించారు. కాగా రైతు సంఘాలు చెప్తున్నదాని ప్రకారం, 2020 నవంబరు నుంచి ఢల్లీి సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజీపూర్‌ వద్ద రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. తట్టుకోలేని వాతావరణం, అపరిశుభ్ర పరిసరాల వల్ల అనారోగ్యానికి గురికావడం, ఆత్మహత్యల వల్ల ఈ మరణాలు సంభవించాయి. మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ రైతు సంఘాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, నిరసనల నేపథ్యంలో తమపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని, నిరసనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలను కొనసాగిస్తామని చెప్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img