Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

హెలికాప్టర్‌ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు : వాయుసేన

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ ప్రయాణిసోన్న హెలికాప్టర్‌ తమిళనాడులో కుప్పకూలిపోవడంతో రావత్‌తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దానిపై తాజాగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) స్పందించింది. అయితే అసంబద్ధ ప్రచారాలు జరుగుతున్నట్లు ఇవాళ వాయుసేన తన ట్విట్టర్‌లో తెలిపారు. నిరాధార ఆరోపణలను ఆపేయాలని ఆ ట్వీట్‌లో ఐఏఎఫ్‌ కోరింది. త్వరలోనే ప్రమాద ఘటనకు చెందిన వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పింది.‘డిసెంబర్‌ 8,2021న జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదానికి గల కారణాలను శోధిస్తున్నాం. అందుకోసం వైమానిక దళం ట్రై సర్వీస్‌ కోర్టు ఆఫ్‌ ఎంక్వైరీ చేసింది. ఈ విచారణ త్వరితగతిన పూర్తవుతుంది. వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటివరకు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను కాపాడాలి. ఎటువంటి సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలి.’ అని వైమానిక దళం విజ్ఞప్తి చేసింది. రావత్‌ దంపతులతో పాటు రక్షణదళ సిబ్బంది మృతి పట్ల త్రివిధదళ దర్యాప్తు చేపట్టనున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపిన విషయం తెలిసిందే. త్వరితగతిన ఈ ఘటన పట్ల విచారణను పూర్తి చేయనున్నట్లు ఐఏఎఫ్‌ తెలిపింది. దీని కోసం దర్యాప్తు కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఐఏఎఫ్‌ చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img