Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఓటీఎస్‌పై దుష్ప్రచారం..: సజ్జల

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్‌పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓటీఎస్‌పై ఎవరినీ బలవంత పెట్టలేదు. ఇది పూర్తిగా స్వచ్చంద పథకం. ప్రజలకు ఇష్టమైతేనే ఓటీఎస్‌ను వినియోగించుకోవచ్చని అన్నారు. ఓటీఎస్‌పై కొన్ని మీడియా సంస్థలు ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఎలాంటి ఆధారలు లేకుండా కథనాలు ప్రచురిస్తున్నాయని అన్నారు. అబద్ధాలు, వితండవాదంతో కథనాలు ఇస్తున్నాయని అన్నారు. లబ్ధిదారులపై రిజిస్ట్రేషన్‌ భారం పడకుండా చూశాం. ఉచిత రిజిస్ట్రేషన్‌తో ప్రభుత్వం మీద రూ.6వేల కోట్లు భారం పడుతోంది. గత ప్రభుత్వ టిడ్కో ఇళ్ల పేరుతో స్కామ్‌ చేసింది. టీడీపీ హయాంలో పేదలకు ఇల్లు కూడా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు. ఇప్పటి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నా తప్పు పడితే ఎలా..?’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img