Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

29న రాష్ట్రపతి రాక..ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్‌

ఈ నెల 29వ తేదీన రాష్ట్రపతి రామ్‌ నాధ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కొరకు హైదరాబాద్‌ నగరానికి రానున్నారు. జనవరి 3 వతేది వరకు హైదరాబాద్‌ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు. దీంతో చేయవలసిన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధిపతులతో బిఆర్‌ కెఆర్‌ భవన్‌ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం సోమేశ్‌ కుమార్స సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ గుర్తింపును మరింత ఇనుమడిరప చేసేలా అధికారులు పనిచేయాలని సీఎస్‌ పేర్కొన్నారు. తదనుగుణంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాష్ట్రపతి పర్యటన సౌకర్యవంతంగా ఉండేలా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.రాష్ట్రపతి నిలయం వైపు వెళ్ళే మార్గంలో ట్రాఫిక్‌ సజావుగా నడిచేందుకు రోడ్డు మరమత్తు, బారికేడిరగ్‌ పనులు చేపట్టాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌, కంటోన్మెంట్‌ బోర్డ్‌ అధికారులను సీఎస్‌ ఆదేశించారు. రాష్ట్రపతి నిలయం వద్ద ప్రొటోకాల్‌ ప్రకారం విధులు నిర్వహించుటకు వైద్య బృందాలతో పాటు ఇతరశాఖల బృందాలను నియమించాలని అన్నారు. నిరంతరాయంగా 24 గంటల విద్యుత్‌ సరఫరాను నిర్ధారించాలని విద్యుత్‌ శాఖను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img