Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

భారత్‌లో 1000కి సమీపంలో ఒమిక్రాన్‌ కేసులు

13 దాటిన కొత్త కేసులు
దేశంలో గత కొంతకాలంగా పదివేలకు దిగువనే నమోదవుతున్న కరోనా కేసులు నిన్న ఒక్కరోజే 13వేలకు పైగా నమోదయ్యాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య కూడా 1000కి సమీపిస్తోంది. ప్రస్తుతం కొత్త వేరియంట్‌ బాధితులు 961కి చేరగా వీరిలో 320 మంది కోలుకున్నారు. ఒక్క దిల్లీ (263), మహారాష్ట్ర (252)లోనే సగానికి పైగా కేసులున్నాయి. మొత్తం 22 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్‌ వ్యాపించింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 268 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 82,402 యాక్టివ్‌ కేసులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,58,778గా ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్‌తో 4,80,860 మృతి చెందారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,43,83,22,742గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img