Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో అతి పొడవైన ఆరు లేన్ల షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ను శనివారం ఉదయం మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. కొత్త ఏడాదిలో పాత, కొత్త నగరాలను కలిపే ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. షేక్‌పేట ప్లైఓవర్‌ ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పించేలా చాలా పురోగతి సాధించాం. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ దేశానికి ఆర్థిక అభివృద్ధిలో నాలుగోవ పెద్ద రాష్ట్రంగా గుర్తింపునిచ్చిందన్నారు. కాగా అతి పొడవైన ఆరు లేన్ల షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ను దాదాపు రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగింది. దాదాపు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా టూ వే ట్రాఫిక్‌ను ఏర్పాటు చేశారు. షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ ప్రధానంగా నాలుగు ప్రధాన జంక్షన్లను కవర్‌ చేయనుంది. షేక్‌పేట్‌, ఫిలింనగర్‌, ఓయూ కాలనీ, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌లు దాటి నేరుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img