Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఫీవర్‌ సర్వేతో మంచి ఫలితాలు : హరీష్‌రావు


కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి హరీశ్‌ అన్నారు. సెకండ్‌ వేవ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. థర్డ్‌వేవ్‌లో ఈ సర్వేతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో మంత్రులు హరీష్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఖమ్మంలో త్వరలో కీమో థెరఫీ, రేడియో థెరఫీ సేవలు అందించనున్నట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో ఖమ్మం ఆస్పత్రిలో అత్యాధునిక ఎంఆర్‌ఐ స్కాన్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణీలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని… నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అందరికీ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని హరీష్‌రావు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img