Monday, May 6, 2024
Monday, May 6, 2024

మేడారం జాతరకు 3,845 బస్సులు ఏర్పాటు

ఆర్టీసీ ఈడీ మునీశ్వర్‌
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఈడీ మునీశ్వర్‌ తెలిపారు. మేడారం జాతరకు ఆర్టీసీ ఏర్పాట్లపై సోమవారం మునీశ్వర్‌ మీడియాతో మాట్లాడుతూ, జాతరకు బస్సుల్లో 21 లక్షల మందిని తరలించడమే ఆర్టీసీ లక్ష్యమన్నారు. ఇతర జిల్లాలకు చెందిన బస్సులను కూడా వరంగల్‌ నుండి మేడారానికి నడుపుతున్నామని తెలిపారు. 51 పాయింట్స్‌ నుండి మేడారానికి బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరంగల్‌ జిల్లాలో 30 పాయింట్స్‌ నుండి మేడారంకు తరలిస్తామన్నారు. వేర్వేరు ప్రాంతాల నుండి వరంగల్‌కు చేరుకున్నవారు… హనుమకొండ నుండి మేడారంకు సురక్షితంగా చేర్చే విధంగా సర్వం సిద్ధం చేశామన్నారు. మేడారంలో భక్తులను జంపన్న వాగుకు తరలించడానికి తొలిసారి మినీ బస్‌ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో, 42 క్యూ లైన్స్‌ ఏర్పాటు చేశామని ఈడీ మునీశ్వర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img