Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

219 మందితో రొమేనియా నుండి బయలుదేరిన ఎయిరిండియా విమానం

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తున్నట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ తెలిపారు. ఇప్పటికే 219 మంది స్వదేశీయులతో కూడిన తొలి ఎయిరిండియా విమానం రొమేనియా నుండి బయలు దేరినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విమానం శనివారం సాయంత్రం 6.30 గంటలకు ముంబయికి చేరుకోనుంది. ఈ తరలింపు ప్రక్రియను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాని ఆయన చెప్పారు. తమ బృందాలు 24 గంటల పాటు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మరో ఎయిరిండియా విమానం కూడా దిల్లీిలో ల్యాండ్‌ కానుంది. భారతీయుల తరలింపులో మంచి సహకారం అందించిన రొమేనియా విదేశాంగ మంత్రి బోగ్డాన్‌ అరెస్కూకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img