Friday, May 3, 2024
Friday, May 3, 2024

చమురు ధరలు పైపైకి

రష్యా దాడి ప్రభావంతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా సహా ఇతర దేశాలు చర్యలు ప్రకటించినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం చమురు ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. ఉదయం బ్యారెల్‌ చమురుపై ఐదు డాలర్ల మేర పెరిగింది. న్యూయార్క్‌ మర్కంటైట్‌ ఎక్స్ఛేంజీ ప్రకారం, బెంచ్‌మార్క్‌ యూఎల్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 5.24 డాలర్లు పెరిగి 108.60 డాలర్లకు చేరింది. మన దేశంలో ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌పై 5.43 డాలర్లు పెరిగి 110.40 డాలర్లకు చేరింది. ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీలోని 31 దేశాలు 60 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వ్యూహాత్మక నిల్వల నుంచి విడుదల చేసేందుకు అంగీకరించాయి. ధరల కట్టడి నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. కానీ మార్కెట్లు దీన్ని ప్రతికూల ధోరణిలో తీసుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img