Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియంలో బోధన

మన ఊరు-మన బడి్ణని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ామన ఊరు-మన బడి్ణని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మన ఊరు మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్‌, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కేసీఆర్‌ ప్రసంగించారు. మన ఊరుమనబడి కార్యక్రమం ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని తెలిపారు. దీనికి వనపర్తి జిల్లా వేదికగా శ్రీకారం చుట్టాం. వనపర్తికి ఆ గౌరవం దక్కుతుంది. తామంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పైకి వచ్చిన వాళ్లమే అని పేర్కొన్నారు. మీ ముందు ఈ హోదాలో నిలబడ్డామంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆ రోజు గురువులు చెప్పిన విద్యనే కారణం. భవిష్యత్‌లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో నిర్మాణం కాబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల బోధన కూడా ప్రారంభం కాబోతుందన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img