Monday, May 6, 2024
Monday, May 6, 2024

గడచిన రెండేళ్లల్లో 176సార్లు చొరబాటు యత్నం

న్యూదిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో 2020లో చొరబాటు యత్నం సందర్భంగా జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లు, హింసాత్మక సంఘటనల్లో 62మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా, 106మంది గాయపడ్డారని మంగళవారం కేంద్రం తెలిపింది. 2021లో 42 మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా, 117మంది గాయపడినట్టు పేర్కొంది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ కశ్మీర్‌లో 176సార్లు చొరబాటుకు యత్నాలు జరిగాయని, ఆయా ఘటనల్లో 31మంది ఉగ్రవాదులు మృతి చెందారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ లోక్‌సభలో ప్రకటించారు. తమకు అందిన సమాచారం ప్రకారం 2020లో 99 సార్లు చొరబాటుకు యత్నించగా, 2021లో 77సార్లు ప్రయత్నించారు. 2020లో జరిగిన ఘటనలో 19మంది ఉగ్రవాదులు మృతి చెందారు. 2021లో 12మంది మృతి చెందగా, ఒకరిని అరెస్టు చేసినట్టు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2020లో జరిగిన చొరబాటు సమయంలో 62మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా, 106మంది గాయపడ్డారని, 2021లో జరిగిన ఘటనల్లో 42మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా, 117మంది గాయపడ్డారని ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img